డీఎస్సీ ఉపాధ్యాయులకు రూ.43,068 నుంచి రూ.58,691 వరకు జీతం
తెలంగాణ రాష్ట్రంలో డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన నూతన ఉపాధ్యాయులకు నెలకు రూ.43,068 నుంచి రూ.58,691 వరకు జీతం అందనుంది. ఎస్జీటీ ఉపాధ్యాయులకు రూ.43,068, స్కూల్ అసిస్టెంట్లకు రూ.58,691 నెల జీతంగా అందనుంది.
విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, ఎస్జీటీలకు రూ.31,040 మూల వేతనంతో పాటు రూ.3,414 ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ – 11%), రూ.7,062 ఖరీదీ భత్యం (డీఏ – 22.75%), రూ.1,552 ఇతర భత్యాలు (ఐఆర్) కలిపి మొత్తం రూ.43,068 నెలకు చెల్లించనున్నారు. స్కూల్ అసిస్టెంట్లకు రూ.42,300 మూల వేతనంతో పాటు రూ.4,653 హెచ్‌ఆర్‌ఏ, రూ.9,623 డీఏ, రూ.2,115 ఇతర భత్యాలు కలిపి మొత్తం రూ.58,691 నెల జీతంగా అందనుంది.
జీతభత్యాలతో పాటు ఉపాధ్యాయులకు ఇతర ప్రయోజనాలు కూడా వర్తిస్తాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. త్వరలో నూతన ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ పూర్తి చేసి, వారిని విధుల్లోకి తీసుకోనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, ఉపాధ్యాయుల సేవలను సద్వినియోగం చేసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.
Post Comment